కుప్పం: మల్లప్ప కొండకు పోటెత్తిన భక్తులు
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండల పరిధిలో వెలసిన మల్లప్ప కొండ పై కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.