ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jan 17, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న మందు బాబులను గుర్తించి శనివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు భారీ జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారికి జరిమానా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. నిషేధిత ప్రాంతాలలో మద్యం సేవించడం చట్టరీత్య నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.