ఇబ్రహీంపట్నం: మాదాపూర్ లో రెవెన్యూ సర్వేర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో రెవెన్యూ సర్వేర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు ఆదివారం మధ్యాహ్నం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అలాగే అర్హులైన వారికి ఉద్యోగ కల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.