సర్వేపల్లి: పొంగిపొర్లుతున్న నెల్లూరు జిల్లాలోని కండలేరు వాగు
భారీ వర్షాలు నేపథ్యంలో మనుబోలు అంబేద్కర్ నగర్ సమీపంలోని కండలేరు వాగు పొంగిపొర్లుతుంది. గంట గంటకు నీరు పెరుగుతుండడంతో ఎస్ఐ శివ రాకేష్ భద్రత చర్యలను చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా బార్కెట్స్ ను అమర్చి అటువైపు వెళ్ళొద్దని సూచనలు జారీ చేశారు. పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. మనుబోలు గుండా రాకపోకలు నిలిచిపోయాయి.