గంగాధర నెల్లూరు: సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే థామస్
చెరువులోని నీరు ఇళ్లలోకి వస్తున్నట్లు కార్వేటినగరం మండలం కృష్ణసముద్రం గ్రామస్థులు జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం లోతట్టు ప్రాంతంలో ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు చెరువు నీటితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీసీ రోడ్లు ఎత్తుగా నిర్మించి ఇల్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదివారం అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.