నాయుడుపేటలో దసరా ఉత్సవాలకు ముస్తాబైన ఆలయాలు
- ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాలంకరణలు
రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు సోమవారం నుండి ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో దసరా మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అమ్మవారి ఆలయాలను నిర్వహకులు ఆదివారం నాటికి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. సూళ్లూరుపేటలోని శ్