శ్రీకాకుళం: తల్లి, చెల్లి నుండి తప్పిపోయి పలాస రైల్వే స్టేషన్ లో చైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షకుల వద్ద ఉన్న ఓ బాలుడు
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలులో ఆర్పిఎఫ్, జిఆర్పి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా ఓ బాలుడు తారసపడ్డాడు. బాలుడు విచారించగా... రాజమండ్రిలో తన తల్లి బాల (30), చెల్లి భవిష్య (8) తో కలిసి సోమవారం బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కమని తెలిపారు. రాజమండ్రి లో హర్షవర్ధన్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నానని బాలుడు తెలిపారు. ప్రస్తుతం బాలుడు పలాస 1098 చైల్డ్ హెల్ప్ లైన్ సంరక్షణలో ఉన్నట్లు జిఆర్పి పోలీసులు తెలిపారు.