రేపు సురుటుపల్లి నందీశ్వరునికి ప్రదోష పూజలు, ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు వెల్లడి ఆ
రేపు సురుటుపల్లిలో నందీశ్వరునికి ప్రదోష పూజలు నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు జరగనున్నట్లు ఆలయ ఛైర్మన్ పద్మనాభరాజు తెలిపారు. తమిళ కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా వస్తారని తెలిపారు. ప్రదోష అభిషేక పూజలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించి టికెట్టు పొందాలన్నారు. సామాన్య భక్తులు దర్శకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు.