పత్తికొండ: పత్తికొండలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ ఆధ్వర్యంలో పత్తికొండలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే స్వగృహం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి నాలుగు స్తంభాల కూడలి వద్ద నిరసన చేపట్టారు. చంద్రబాబు మొండి వైఖరి విడనాడాలని, పేదలకు ఉచిత వైద్య విద్యను అందించాలని వారు నినాదాలు చేశారు.