కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టరేట్ అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు, డివిజన్, మండల కేంద్రంలో కూడా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అర్జీదారులు ఆయా మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్య లను కలెక్టరేట్లో ఫిర్యాదుల రూపంలో సమర్పించవచ్చన్నారు.