కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో నవంబర్ 8న భక్త కనకదాస జయంతిని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గంలో నవంబర్ 8న కురబల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో మంగళవారం కురబ కులస్తుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కనకదాస జయంతి తో పాటు అదే రోజు కనకదాస విగ్రహ ప్రతిష్ట కూడా చేస్తామన్నారు. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.