నగరి: హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం : మాజీ మంత్రి రోజా
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందని మాజీ మంత్రి రోజా గురువారం ధ్వజమెత్తారు. విజయపురం మండల ఎంపీపీగా మంజు బాలాజీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. విజయపురం ఎంపీడీవో కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా మండల నాయకులతో కలిసి .మంజు బాలాజీ గారిని సత్కరించి అభినందనలు తెలిపారు.