అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శనివారం ఎమ్మెల్యే తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయంలో వారిని కలిసారు. పెండింగ్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.