నల్గొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పరిశోధకులకు పట్టాలను అందజేసిన గవర్నర్
నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నల్లగొండ నాలుగవ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి శ్రీ విష్ణుదేవ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బిఎస్ మూర్తి స్నాతకోపన్యాసాన్ని ఇచ్చారు. ఈ విడత 22 మంది పిహెచ్డి పరిశోధకులకు 53 పిజి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.