తాడేపల్లిగూడెం: ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయండి, అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్
ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంకాలం 5:30కు ఆర్డీవో కార్యాలయంలో రెవిన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 80 ఎకరాల్లో వరి కోత పూర్తయిందని అధికారులు వివరించారు. తదనంతరం జాయింట్ కలెక్టర్ కడియద్ధం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని, తేమశాతం తెలిపే యంత్రాన్ని, వరి రాశులను పరిశీలించారు.