నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హెచ్.కొట్టాల గ్రామంలో లారీ డ్రైవర్ చల్లా తిరుమలేష్ (31) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న అతడిని బేతంచెర్ల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి వెంకటరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు శెట్టి తెలిపారు.