ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఎస్బిఐ ఎటిఎం మరియు అమ్మవారి శాల వీధి నందు నివాసంలో మరో వ్యాపార సంస్థ నందు గురువారం రాత్రి దొంగతనం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని సిఐ రాజేష్ కుమార్ పరిశీలించారు. క్లూస్ టీం తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు. ఎవరూ లేని టార్గెట్ గా చూసుకొని గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు. ఎవరైనా ఊరికి వెళ్లేటప్పుడు సంబంధించిన సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సిఐ విజ్ఞప్తి చేశారు