ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఆదివారం మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల మాఖన్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వై ఎస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.