జగిత్యాల: ఘనంగా శివ దుర్గ సేవా సమితి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల శోభాయాత్ర
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవుని గోవింద పల్లె మండపం వద్ద సోమవారం దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక వాహనంపై అమ్మవారిని ఉంచి శోభాయాత్రను కొనసాగించారు. శోభాయాత్రలో వివిధ దేవి, దేవతల రూపాలతో మంగళ వాద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభయాత్రని కొనసాగించారు. శోభ యాత్ర ముందు మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దీక్ష పొందిన భవానీలు శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేకముగ ఏర్పాటుచేసిన మంటపంపై అమ్మవారిని చరపతిష్ట చేసి పూజలు కొనసాగించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి నామస్మరణతో మంటపమంతా మారుమోగింది. విచ్చేసిన భక్తులకు త