మునగపాక మండలం నాగవరం కూడలిలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లకు రూ.1,92,910 జరిమానా: ఎస్సై ప్రసాద్ రావు
ఎన్నికల నేపథ్యంలో మునగపాక మండలం నాగవరం కూడలిలో సోమవారం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అధిక బరువుతో వెళుతున్న 3 టిప్పర్లను ఎస్సై ప్రసాద్ రావు అదుపులోకి తీసుకున్నారు. ఈ టిప్పర్లు పట్టుబడ్డాయి. దీంతో ఆ టిప్పర్లకు రూ.1,92,910 జరిమానా విధించినట్లు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. అతి వేగంగా వెళ్ళినా, అధిక లోడ్ తో వెళ్ళినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.