ప్రొద్దుటూరు: అగస్తేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం
Proddatur, YSR | Oct 27, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలిసిన అతి ప్రాచీన పురాతన ఆలయమైన శ్రీ ఆగస్ట్యేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆగస్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా వంగల నారాయణరెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, పలువురు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, శ్రీ అగస్టేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కొరకు తాము ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు.