ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని మండల రెవెన్యూ అధికారులు రికార్డులను చక్కగా భద్రపరచాలని, ప్రజలు భూములకు సంబంధించి ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అద్దంకి ఇన్చార్జి డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు రెవెన్యూ కార్యాలయాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలని, రెవెన్యూ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా బాధ్యతగా ఉండాలన్నారు.