కలువాయిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
Gudur, Tirupati | Oct 21, 2025 కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్బంగా బలిమెల ఘటనలో అమరులైన అనకర్ల కేశవులు స్థూపం వద్దకు కేశవులు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు, పోలీస్ శాఖ వారు చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. విద్యార్థులు, ప్రజలకు పండ్లు పంచి పెట్టారు.. అనంతరం రాపూరు సిఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.... 1959 వ సంవత్సరం సిఆర్పిఎఫ్ జవాన్లు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 2008 వ సంవత్సరం లో బలిమెల ఘటనలో అనకర్ల కేశవులు అమరుడ