పులివెందుల: తుమ్మలపల్లి యు సి ఐ ఎల్ సమస్యలను పరిష్కరించండి
: జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Pulivendla, YSR | Sep 23, 2025 యు సి ఐ ఎల్ లో సమస్యలను పరిష్కరించి, పర్యావరణ సహితంగా ప్రాజెక్టును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యు.సి.ఐ ఎల్) సమస్యలపై ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు.