సూళ్లూరుపేటలో భారీ వర్షం
- తీవ్ర ఇబ్బందులు పడ్డ స్థానిక ప్రజలు, వాహనదారులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట, ఓజిలి, పెళ్లకూరు నాయుడుపేట తడ దొరవారిసత్రం మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు రెండు గంటల పైగా భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల పంట పొలాలను నీటి మునిగాయి. ఆకాశం కారు మబ్బులు కొమ