వర్ని: గత ప్రభుత్వంలోని డబల్ బెడ్ రూమ్ లో బిల్లులు చెల్లించాలని కోటగిరిలో వివిధ రాజకీయ పార్టీ నాయకుల ధర్నా
లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కోటగిరి లో బిజెపి టీఆర్ఎస్ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఇంటి నిర్మాణం ఆలస్యమవుతుందని వెంటనే పనిని బట్టి బిల్లులు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళననను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.