అసిఫాబాద్: నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాల శాఖ ద్వారా అందించాలి: రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి
నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లోని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్టోరల్ అధికారి కార్యాలయం నుండి ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా ఎన్నికల అధికారులు-కలెక్టర్ వెంకటేష్ దోత్రే తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి మాట్లాడుతూ నూతనంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.