పెండేకల్లు గ్రామంలో మద్యం మత్తులో యువకుల వీరంగం
Dhone, Nandyal | Sep 16, 2025 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని ఎం.పెండేకల్లు గ్రామంలో మంగళవారం మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. పొలానికి సంబంధించిన సమస్యపై కొలుముల పల్లెకు చెందిన యువకులు ఎం పెండేకల్లు గ్రామానికి వచ్చి, అక్కడి సమీప బంధువులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం గొడవకు దారి తీసి గ్రామంలో ఉద్రిక్తత సృష్టించారు. గ్రామస్థులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు.