తిరుమలగిరి: బోయిన్పల్లిలో వ్యక్తి దారుణ హత్య, విచారణ చేపట్టిన పోలీసులు
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీ కాంప్లెక్స్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సమీర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి కత్తులతో దాడి చేసి హతమార్చారు. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదు మంది దుండగులు తన ఇంటి సమీపంలో కూర్చుని ఉన్న సమీర్ ను లక్ష్యంగా చేసుకొని మెడపై పొత్తికడుపులో విచక్షణ రహితంగా కత్తులు, బ్లేడులతో దాడికి పాల్పడ్డారు. హత్య జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బోయిన్పల్లి పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించి స్థానికుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనస్థలికి చేరుకున్న ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పె