నిర్మల్: నిర్మల్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టడంతో గాంధీ కూరగాయల మార్కెట్ లో పేరుకుపోయిన చెత్త
Nirmal, Nirmal | Sep 16, 2025 నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికులు సమ్మెబాట పట్టారు. మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్ తో ప్రధాన రహదారులపై చెత్త చెదారం పేరుకుపోయింది. దీంతో కూరగాయలు విక్రయదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి చెత్త చెదారం నుండి దుర్గంధం, దోమలు రావడంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.