రాయదుర్గం: బొమ్మనహాల్ సమీపంలో HLC కాలువలో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు
తుంగభద్ర రిజర్వాయర్ నుండి వచ్చే ఎగువకాలంలో బొమ్మనహాల్ హెచ్ఎల్సి సెక్షన్ పరిధిలో 116 కిలోమీటర్ల వద్ద రెండు గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. శనివారం సాయంత్రం మంతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే మృతదేహాలు ఎవరివనే సమాచారం తెలియరాలేదు. మరిన్ని వివరాలు మృతదేహాలను వెలికి తీసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే కర్నాటక నుండి ఈ మృతదేహాలు కొట్టుకు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.