సింగరాయకొండ-కందుకూరు రాత్రి వేళ బస్ సర్వీసును ప్రయాణికులు వినియోగించుకోవాలని కందుకూరు డిపో మేనేజర్ శ్రీనివాసులు కోరారు. కందుకూరు నుంచి రాత్రి 9గంటలకు బస్సు బయల్దేరుతుందన్నారు. S.కొండ మీదుగా ఒంగోలుకు చేరుతుందన్నారు. అలాగే ఒంగోలు నుంచి రాత్రి 10గంటలకు S. కొండ మీద కందుకూరుకు మరో బస్సు ఉంటుందన్నారు. రైళ్ల రాకపోకల సమయానికి అనుగుణంగా స్టేషన్ల వద్ద ప్రయాణికులకు బస్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.