తిరుమలగిరి: తిరుమలగిరి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మందుల సామేలు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం పరిధిలోని తొండ గ్రామం తో పాటు పలు గ్రామాలలో ఎమ్మెల్యే మందుల సామేలు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తొండ గ్రామంలోని అంగన్వాడి భవనంలోకి వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని నేరుగా బాధితులను పలకరించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. బాధితులకు అండగా నిలబడి వారి ఇబ్బందులను తొలగించాలని త్వరగా ఆదేశించారు. వర్షపు వరద నీరు సాఫీగా పోయేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామని ప్రజా సమస్యలు ఉంటే నేరుగా తమను సంప్రదించవచ్చు అన్నారు.