జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
Anantapur Urban, Anantapur | Sep 14, 2025
జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లు ,నేరచరితులు,చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని సూచిస్తూ కౌన్సెలింగ్ చేపట్టారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు.