ఓబులదేవరచెరువులో బైక్, కారు ఢీ.. వ్యక్తి మృతి
శ్రీ సత్య సాయి జిల్లా ఓబులదేవరచెరువులోని వెంకటసాయి ఐటీఐ కళాశాల సమీపాన బైపాస్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం, కారు ఢీ కొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కదిరికి చెందిన అల్లాబకష్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ లో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అల్లాబకష్ బీడీలు సరఫరా చేసేందుకు బాగేపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.