కోడుమూరు: కోడుమూరులో వచ్చేనెల 7న జరిగే హిందూ సమ్మేళన వేడుకకు సంబంధించిన కరపత్రాలు విడుదల
కోడుమూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 7న జరిగే హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను శనివారం ఆలయం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ సమ్మేళన సమితి, సమస్త ఆలయాల సభ్యులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టణంలోని రామాలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు మహా పాదయాత్ర జరుగుతుందన్నారు. మహా వేడుకకు ప్రముఖ పీఠాధిపతులు హాజరు కానున్నట్లు తెలిపారు. హిందువులు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు.