ముక్కంటిని దర్శించుకున్న ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ హరి జవహర్లాల్
వాయు లింగేశ్వరుని దర్శించుకున్న ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ విచ్చేశారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆలయంలో క్యూలైన్లు, భక్తులతో ముఖాముఖి, లడ్డూ ప్రసాదం పోటు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.