సంగారెడ్డి: సంగారెడ్డిలో రోడ్డు నిర్మాణానికి 50 లక్షలు మంజూరు
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేట నుంచి హాస్టల్ గడ్డ వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరైనట్లు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు హెచ్ఎండిఏ నిధుల నుంచి ఈ నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు