అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్ లక్ష్మీనారాయణ లంచం తీసుకుంటూ బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నగరానికి చెందిన శ్రీనివాసులు అనే మాజీ ఉద్యోగి తన పింఛన్ కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఫైల్ ప్రాసెస్ చేయాలంటే 10 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనట్టు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని కొంత తగ్గించాలని శ్రీనివాసులు బ్రతిమలాడారు చివరకు ఎనిమిది వేలు ఇస్తే కానీ పని చేసేది లేదని చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు.