గంగాధర నెల్లూరు: శ్రీరంగరాజపురం మండలం పిల్లారి కుప్పం పంచాయతీకి చెందిన పలువురు వైసీపీలో చేరిక
శ్రీరంగరాజపురం మండలం పిల్లారి కుప్పం పంచాయతీకి చెందిన పలువురు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం వైసీపీలో చేరారు. కండువాలను కప్పి పార్టీలోకి వారు ఆహ్వానించారు. చేరిన వారిలో నరేంద్ర, హిమాచలపతి రెడ్డి, రామకృష్ణారెడ్డి, కాశీ విశ్వనాథరెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు.