అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఇరు వర్గాలకు చెందిన పలువురు బాహాబాహీకి దిగారు. ఆదివారం కేపీఎస్ సినిమా థియేటర్ ఎదురుగా ఇరు వర్గాలు ఎదురు పడి ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. అనంతపురం వైపునకు వెళ్తున్న ఇద్దరు గుత్తి పట్టణంలోకి వస్తున్న మరో వర్గానికి చెందిన ఇరువురు కొట్లాటకు దిగారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. నడి రోడ్డుపై ఇరు వర్గాల వారు ద్విచక్రవాహనాలు ఆపి తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల వారు కొట్లాటకు దిగి పరస్పరం దూషణలకు దిగారు. నడి రోడ్డుపై హంగామా సృష్టించగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.