కొండపి: మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ పై కేసు నమోదు 41A నోటీసులు ఇచ్చిన సింగరాయకొండ పోలీసులు.
సింగరాయకొండలో నకిలీ మద్యం వ్యతిరేక పోరుబాట కార్యక్రమంపై వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేశ్ శుక్రవారం పోలీస్ స్టేషన్లో 41A నోటీసు తీసుకున్నారు.ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరితే తప్పుడు కేసులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్దోషులపై చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.