శ్రీశైలంలోని శివ స్వాములు ఆందోళన మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి వచ్చింది.సోమవారం ఉదయం నుంచి ఇరుముడి కలిగిన శివ స్వాములు దర్శనం ఆలస్యం కావడంతో ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం నుంచి కొనసాగిన ఆందోళన మంగళవారం తెల్లవారుజామున వరకు కొనసాగింది .ఈవో డౌన్ డౌన్, అంటూ నినాదాలు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ యుగందర్ బాబు శివ స్వాములపై లాఠీచార్జి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది.అర్ధరాత్రి శ్రీశైలం చేరుకున్న జిల్లా కలెక్టర్ ఎస్పీ, డీఐజి స్వాములతో మాట్లాడి పరిస్థితి చక్కగా పెట్టారు.