తాడిపత్రి మండలం ఆలూరు కోనలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకాలు, అర్చనలు, కాగడ హారతి, హారతి వంటి పూజలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను వినియోగం చేశారు. ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది.