కూటమి మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
- సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కిలివేటి నివాసం వద్ద మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టిన ప్రజా ఉద్యమ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం పార్టీ నాయకులతో కలసి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆవిష్కరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు సీఎం చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టడాని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రైవేట్ కు అప్పగిస్తున్నామంటూ వాటిని మంత్రులు మరియు ఎమ్మెల్యేలు జోరుగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన అని చెప్పుకునే చంద్రబాబు... రాష్ట్రానికి ఇప్పటి