మాచర్ల పరిధిలో ఎత్తిపోతల అందాలు చూడతరమా
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండల పరిధిలో ఎత్తిపోతల జలపాతం శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగుతుంది. కొండల మీదుగా 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగుతున్న జలపాతం అందాలు పర్యాటకులను ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భాగంగా మంత్రముగ్ధులు చేస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వాగుల ద్వారా వంకల ద్వారా భారీగా వరద నీరు వచ్చి రోజు చేరుతుంది. జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.