గిద్దలూరు: నిబంధనలు పాటిస్తూ దీపావళి టపాసుల దుకాణాలు నిర్వహించుకోవాలన్న బెస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట ఎస్సై రవీంద్రారెడ్డి నిబంధనలు పాటిస్తూ దీపావళి టపాసుల దుకాణాలు నిర్వహించుకోవాలని శనివారం దుకాణదారులకు తెలిపారు. రాత్రి 8 గంటల సమయంలో మీడియాతో మాట్లాడిన ఎస్ఐ రవీంద్రారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా జాగ్రత్త వహిస్తూ చిన్న పిల్లల్ని దీపావళి ముందు సామాగ్రి కాల్చే సమయంలో దగ్గర ఉంచుకోకుండా చూసుకోవాలన్నారు. తాత్కాలిక అనుమతుల లైసెన్సులతో దుకాణదారులు దీపావళి ముందు సామాగ్రి విక్రయించాలని అంతేకాకుండా ఒక్కొక్క దుకాణానికి 15 అడుగుల దూరం ఉండాలని తెలిపారు.