కాశేపల్లి సమీపంలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కల్లూరు గ్రామానికి చెందిన రామాంజనేయులనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తడిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.