మార్కాపురం: మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజబాబు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి వేములకోట గ్రామాలలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో కలిసి కలెక్టర్ సందర్శించారు. పంట నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. తుఫాను కారణంగా ఆర్థికంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ రైతులకు ధైర్యం చెప్పారు. తర్వాత చెరువులు పరిసర ప్రాంతాలను పరిశీలించి తుఫాను కారణంగా నిండిన చెరువులను పరిశీలించి చెరువుల భద్రతపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.