చిత్తూరులో ధన్వంతరి భగవాన్ జయంతి
Chittoor Urban, Chittoor | Oct 18, 2025
ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలు చిత్తూరు నగర 37 డివిజన్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు హాజరయ్యారు. ప్రపంచ మానవాళికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించిన ధన్వంతరి భగవాన్ జయంతిని నాయీబ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు.